రెడ్ ఫ్లాగ్ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
మహాసభలను విజయవంతం చేయండి
రాష్ట్ర కార్యదర్శి మరీదు ప్రసాద్ బాబు
గాంధీనగర్ యదార్థవాది
యంయల్ పిఐ(రెడ్ ఫ్లాగ్) 10వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి మరీదు ప్రసాద్ బాబు పిలుపునిచ్చారు. మహాసభల పోస్టర్ లను స్థానిక పూర్ణానందంపేట ఎస్ కె చాంద్ హాల్లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాసభలు డిసెంబర్ 14 నుండి 17 వరకు నాలుగు రోజుల పాటు విజయవాడలో జరుగుతాయని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చలు సాగుతాయన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని, బిజెపి యేతర పార్టీల ఐక్యసంఘటనకు చర్చలు నిర్వహిస్తామన్నారు. 14న ప్రారంభమౌతాయన్నారు. ఆరోజు సిపిఐ, సిపిఎం, యంయల్ పార్టీలు జాతీయ నాయకుల సందేశాలు ఉంటాయి. 15వ తేదీ వ్యవసాయ రంగం సంక్షోభం-సవాళ్లు-పరిష్కారాలు అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నామన్నారు. 16వ కమ్యూనిస్టుల ఐక్యత, కమ్యూనిస్టు పార్టీలే ప్రత్యామ్నాయం అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నామన్నారు. 17వ తేదీ భవిష్యత్తు కర్తవ్యాలు, తీర్మానాల ఆమోదంతో మహాసభలు ముగుస్తాయన్నారు. మహాసభలకు అమరవీరుల ఆశయాలను కీర్తిస్తూ విప్లవ పాటలను కళాకారులు ఆలపిస్తారని పేర్కొన్నారు. అమర కళాకారుల వేదిక డోలక్ యాదగిరి కళా బృందం విప్లవకారుల పాటలు గానం చేస్తారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మరీదు ప్రసాద్ బాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు పోలవరపు కృష్ణా, సుదమల్ల భాస్కర్, బుజెందర్ మాన్యపు, కాగిత వెంకటేష్, తూర్పాటి సారయ్య తదితరులు పాల్గొన్నారు.





