రైతులకు బీఅర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే
హుస్నాబాద్ యదార్థవాది
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తడిసిన ధాన్యాన్ని హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సందర్శించారు. నియోజకవర్గ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిన రైతులు అధైర్య పడొద్దని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా భరోసా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అకాల వర్షాలతో హుస్నాబాద్ నియోజకవర్గంలో చాలా చోట్ల వరిధాన్యం మొక్కజొన్నలు, పొద్దు తిరుగుడు తడిసి పోయిందని తడిసిన ధాన్యం ఆరబెట్టి మిల్లర్లతో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులును ఆదేశించారు.