రైతులకు బేడీలు వేసింది మీరైతే.. ఉచిత కరెంటు ఇచ్చింది మేము..
-కాంగ్రెస్ పార్టి అద్వర్యంలో సీఎం కేసిఆర్ దిష్టిబొమ్మ దగ్గం
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
రైతు రాజ్యం అని చెప్పుకొనే బిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవేల్లి భూ నిర్వాసితులకు బేడీలు వేయించిన ఘనత మన ఎమ్మెల్యే సతీష్ బాబుకే దక్కుతుందని టీపీసీసీ మెంబర్ కేడెం లింగమూర్తి అన్నారు. కాంగ్రెస్ పార్టి అద్వర్యంలో హుస్నాబాద్ కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద టీపీసీసీ మెంబర్ కేడెం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య ల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన చేసి సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గాంధీభవన్లో చేపట్టిన సత్యాగ్రహ దీక్ష నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్ఎస్ అనవసర రాద్దాంతం చేస్తుందని ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చలేని బిఆర్ఎస్ నాయకులు ప్రజల దృష్టిని మరల్చేందుకే అనవసర రాద్దాంతం చేస్తున్నారని, రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, 24 గంటల ఉచిత కరెంటు అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, కనీసం 12 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లేదని తొమ్మిదిన్నరేళ్ల పాలనలో విద్యుత్ సంస్థలను రూ.60వేల కోట్ల అప్పుల్లో ముంచిన ఘనుడు సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు.. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అంతేకాకుండా, రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి, రైతులకు ఇందిరా జల ప్రభ ద్వారా బోర్లు వేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు, మున్సిపల్ కౌన్సిలర్ పల్లపు రాజు కల్లేపల్లి కావ్య, వెంకటస్వామి, వెన్నెరాజు, పోతుగంటి బాలయ్య, బిక్యానాయక్, గుడాల నాగులు, కృష్ణస్వామి, విద్యాసాగర్, జవహర్లాల్, సతీష్ ,విశ్వతేజ, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.