రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాన్ని పరామర్శించిన: సునిత లక్ష్మారెడ్డి.
మెదక్ యదార్థవాది ప్రతినిది
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాయి పెంటయ్య రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబాన్ని సోమవారం పరామర్శించి ఆర్థిక సాయం అందించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితాలక్ష్మారెడ్డి.. ప్రభుత్వ పరంగా వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం గూలోత్ తాండ గూగుల్లోతు రాములు నాయక్ నిన్న ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన రాములు నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సార రామా గౌడ్, స్థానిక ఎంపీటీసీ స్వప్న కిషోర్ గౌడ్, ఎంపీటీసీ గుంజరి ప్రవీణ్ కుమార్, నాగ్ సాన్ పల్లి సర్పంచ్ ఎల్లమయ్య, రాజీపేట ఉప సర్పంచ్ శివ, రాయిలాపూర్ శ్రీనివాస్ రెడ్డి ,మూత్రాజు పల్లి సర్పంచ్ సంజీవులు, మాజీ సర్పంచ్ పట్టాయ నాయక్, మనోహర్ రెడ్డి, వెంకటాపూర్ ఉప సర్పంచ్ మహేష్, బీ అర్ ఎస్ సోషల్ మీడియా కోర్డినేటర్ రామాంజనేయులు, సార ప్రతాప్ గౌడ్ ,శేకులు ,మండల నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొనడం జరిగింది.