వంద పడకల దవాఖానలో ఆధునిక వైద్య సేవలు..
యదార్థవాది ప్రతినిది ఆర్మూర్
ప్రజల ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ ఆర్మూర్ వంద పడకల దవాఖాన అని జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ ఆసుపత్రిలో శనివారం ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్మూర్ ఆసుపత్రి ద్వారా ఆధునిక వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఇప్పటికే 25వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగి ఒక్కో తల్లికి 50వేల రూపాయల చొప్పున ఖర్చు తప్పింది. మహిళల సంక్షేమం కోసం తల్లికి చీరె, పుట్టిన బిడ్డకు బట్టలు, పిల్లల కోసం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఆరోగ్య సామాగ్రి, ఆట వస్తువులు, దోమల తెర వంటి వాటితో శిశు రక్షణకు ఇస్తున్నదే కేసీఆర్ కిట్. 6 నెలల గర్భవతి నుంచి 3 నెలల బాలింత వరకు ఆమెకు ఆర్దికంగా అండగా ఉండేందుకు 12 వేల రూపాయలు ఇస్తూ, ఆడపిల్ల పుడితే అదనంగా 1000 రూపాయలతో పాటు ఇస్తున్న ప్రభుత్వమిది. దీనివల్ల 10 లక్షల మంది మహిళలు లబ్ది పొందారని, ఆర్మూర్ ఆసుపత్రిలో మరిన్ని అత్యాధునిక సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ నాగరాజు ఆసుపత్రి డాక్టర్లు బిఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్ పండిత్ ప్రేమ్ కౌన్సిలర్లు గంగా మోహన్ చక్రు రంగన్న మైనారిటీ నాయకులు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.