వర్టీకల్స్ సమర్ధ అమలుపై సమీక్ష సమావేశం
యదార్థవాది ప్రతినిది మెదక్
ఫంక్షనల్ వర్టీకల్స్ పై సమీక్ష సమావేశం శనివారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి.రోహిణి ప్రియదర్శిని నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు రకాల వర్టీకల్స్ ను అన్ని స్థాయిల పోలీసు అధికారులు సమర్ధవంతంగా అమలయ్యే విధంగా చూడాలని అన్నారు పోలీసు శాఖ అమలు చేస్తున్న పలు రకాల వర్టీకల్స్ రిసెప్షన్, బ్లూ కోట్స్, పెట్రో కార్స్, స్టేషన్ రైటర్లు, క్రైమ్ రైటర్లు, క్రైం సిబ్బంది, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, వారెంట్, సమన్స్ సిబ్బంది, టెక్ టీమ్, 5 ఎస్, మెడికల్ సర్టిఫికెట్స్, ఎఫ్.ఎస్.ఎల్., సెక్షన్ ఇంచార్జ్, ఐఓలు, జనరల్ డ్యూటీ సిబ్బందికి సంబందించిన వర్టీకల్స్ పై సమగ్రంగా సమీక్ష నిర్వహించి జిల్లా సిబ్బందికి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పి సైదులు తూప్రాన్ డిఎస్పి యాదగిరి రెడ్డి డిసిఆర్బి సిఐలు శ్రీధర్ దిలీప్ ఎస్బి సిఐ నవీన్ బాబు సిసిఎస్ సిఐ గోపీనాథ్ నర్సాపూర్ సిఐ షేక్ మదర్ లాల్ తూప్రాన్ సిఐ శ్రీధర్ రామయంపేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి డిసిఆర్బి ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
