వాణీదేవి రచనలు నేటి తరానికి మార్గనిర్దేశం
హైద్రాబాద్ సంస్థాన స్వాతంత్ర సమరయోధుడు స్వామి రామానంద తీర్థ
నిజాం రాష్ట్రంలో మాహాత్మ గాందీ పర్యటనలు. ఆది హిందూ వ్యవస్థాపకుడు భాగ్య రెడ్డి వర్మ ల రచనలు ఆవిష్కరణ …….
గజ్వేల్ 23 డిసంబర్ 22
హైద్రాబాద్ సంస్థాన విలీన విమోచన స్వాతంత్ర సమరయోధుడు గా స్వామి రామానంద తీర్థ, నిజాం రాష్ట్రంలో మహాత్మా గాంధి పర్యటన, ఆదిహిందూ సంఘం వ్యవస్థాపకుడు గా భాగ్య రెడ్డి ల గొప్పతనాన్ని చాటుతూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, ఎమ్మెల్సీ సురభీ వాణీదేవి రాసిన రచనలు నేటి తరానికి ఎంతో మార్గదర్శనం చేస్తాయని సురభి దయాకర్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. వెంకటరమణ కొనియాడారు. శుక్రవారం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ కూతురు ఎమ్మెల్సీ సురభి వాణీదేవి రచనలను కళాశాల లో ఆవిష్కరించారు. ఆనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. వెంకటరమణ మాట్లాడుతూ స్వాసంత్రం సిద్దిస్తున్న తరుణంలో హైద్రాబాద్ ప్రజలకు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కలిగించాలని 1946 జూలై 3న భారతదేశంలో రాజకీయ విప్లవం వస్తున్న తరుణంలో హైద్రాబాద్ సంస్థానం దీని నుంచి తప్పుకోవడానికి ఇష్టపడదని, ప్రజల మనోభావాలను గౌరవించాలని స్వామి రామానంద తీర్థ నినదించిన తీరును వాణీదేవి రచనల్లో పేర్కొని గొప్పదనాన్ని చాటారని కొనియాడారు. హైద్రాబాద్ సైన్యాలకు పరాజయం తప్పదన్న విషయం గ్రహించగానే స్వామి రామానంద తీర్థ ను నిజాం రాజు జైలు నుండి విడుదల చేయగా సుల్తాన్ బజార్ లోగల ఆయన ఇంటి ఆవరణలో వేచివున్న అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి రామానంద తీర్థ చేసిన భావోద్వేగ ప్రసంగం నేటి యువతను చైతన్య పరిచేలా వివరించారని, పార్లమెంటు సభ్యునిగా హైద్రాబాద్ రాష్ట్ర అభవృద్ధికి చేసిన కృషి, దారిద్య్ర నిర్మూలన, వెనకబడిన, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి రామానందతీర్థ చేసిన కృషిని తెలియజేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా నిజాం రాష్ట్రంలో మహాత్ముని పర్యటనలతో పాటు ఆది హిందూ సంఘం వ్యవస్థాపకుడు భాగ్యరెడ్డి వర్మ లపై వ్రాసిన రచనలలో ఎంతో విలువైన సమాచారం ఉందన్నారు. నిజాం రాష్ట్రంలో మాహత్మ గాందీ ని పర్యటింప జేసెలా దర్మవీర బిరుదు గల వామన్నాయక్ చేసిన కృషి అనిర్వచనీయమని, ఆయన కృషి వల్ల 1929 ఏప్రిల్ 6 న గాంధీజీ మొదటిసారి హైద్రాబాద్ పర్యటన సాగిందని, ఆయన పాల్గొన్న బహిరంగ సభలో ప్రకటించిన ముఖ్యమైన అంశాలు కూలంకషంగా వివరించిన ఘనత కేవలం వాణీదేవికే దక్కిందన్నారు. తెలంగాణా దళిత జనొద్దరణ లో భాగంగా ఆదిహిందు సంస్థ , సోషల్ సర్వీస్ లీగ్ న్యాయ పంచాయతీ వ్యవస్థ ద్వారా మాదర భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషిని నేటి తరం నేర్చుకోవాల్సిన అవసరం స్పష్టంగా వివరించారని తెలిపారు. దళితుల అభివృద్ధికి జగన్నిత్ర మండలి ద్వారా పాఠశాలల స్థాపన, అంటరానితనం ప్రారదొలాలనే సంకల్పంతో సభలు, సమావేశాలు నిర్వహించడం, దళితులను ఆర్థికంగా అభవృద్ధి చేయాలని చేసిన సూచనలు సత్ఫలితాలివ్వడం గురించి వాణీదేవి రాసిన రచనల్లో గొప్పగా చెప్పడం జరిగిందన్నారు. తండ్రి పీవీ నరసింహారావు ఆశయాల కనుగుణంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకుని స్వాతంత్య్రం పూర్వం ఉన్న మేదావులపై వాణీదేవి రచనలలో ఎంతో మందికి తెలియచేసేలా పూనుకోవడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది డాక్టర్ ఎస్. ఫణీంద్ర, డాక్టర్ ఆర్.నిర్మల, సిహీచ్. ఎస్. సంతోష్, నరేష్ రెడ్డి, సౌమ్య, సౌందర్య, స్నేహ, ఈశ్వర్, భారతి, పూజిత, మమత రెడ్డి, అరుణ, ప్రవీణ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు