మైనర్ వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమాని పై కేసు నమోదు చేస్తాం: పోలిస్ కమీషనర్
కరీంనగర్ యదార్ధవాది
మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్స్తున్నట్లు కరీంనగర్ పోలిస్ కమీషనర్ ఎల్. సుబ్బారాయుడు తెలిపారు.. కరీంనగర్ కమీషనర్ కార్యాలయములో గురువారం వాహనాలు నడిపిన మైనర్ లకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా, పట్టణంలో ప్రతి రోజు వాహనాల
చెకింగ్ నిర్వహిస్తమని అందులో భాగముగా మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని మైనర్లకు వాహనాలు ఇస్తే వారు రోడ్డు నిబంధనలు తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాలలో చాలామంది అవయవాలు కోల్పోతు కుటుంబాల వారు నష్ట పోతున్నారని మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఒకవేళ మైనర్ కు వాహనం ఇచ్చి ఏదైనా ప్రమాదం జరిగితే మైనర్ డ్రైవింగ్ చేస్తూ వాహనం తో పట్టుబడితేవాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ప్రతిరోజు కరీంనగర్ లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కోర్టులో హాజరు పరుస్తున్నామని ఒకవేళ ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ సార్లు మద్యం సేవించి దొరికితే జైలు శిక్ష తప్పదని జైలు శిక్ష పడిన వాహనదారుల లైసెన్స్ రద్దుకై రవాణా సంస్థ వారికి సిఫారసు చేస్తామని కమిషనర్ తెలిపారు. కరీంనగర్ లో ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తూ, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్న కరీంనగర్ ట్రాఫిక్ ఏ సి పి విజయకుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు తిరుమల్, నాగార్జున రావు ట్రాఫిక్ సిబ్బందిని ఆయన అభినందించారు.