వాహ్..! చాయ్..
సిద్దిపేటలో చాయ్ తాగిన మంత్రి పొన్నం ప్రభాకర్..
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట ఇక్బాల్ మినార్ వద్ద ఉన్న మదీన హోటల్ లో చాయ్ తాగారు. కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన భారీ కాన్వాయ్ తో మదిన హోటల్ చేరుకొని అందరితో కలిసి చాయ్ తాగారు ఆయన తో పాటు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూము కుంటా నర్సారెడ్డి దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం సిపిఐ నాయకుడు మంద పవన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గౌడ్ నాయకులు మజర్ మాలిక్ సోహైల్ తదితరులు ఉన్నారు.