విఎస్ఎస్ కన్వెన్షన్ హల్ ప్రారంభించనున్న : మంత్రి హరీష్ రావు
సిద్దిపేట యదార్థవాది
సిద్దిపేట జిల్లా పట్టణంలో కరీంనగర్ రహదారి పైనున్న రంగనాయకుల గుట్ట పక్కన నిర్మించిన వైశ్య సంక్షేమ సమితి కన్వెన్షన్ ప్రారంభోత్సవం సోమవారం ఉ.10.30 గంటలకు జరుగుతుందని విఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఆదివారం కన్వెన్షన్ ఆవరణలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధులు కొమరవెల్లి అంజయ్య, మురం శెట్టి రాములు, గంప శ్రీనివాస్, కొర్తివాడ లక్ష్మణ్, ఐతరత్నాకర్, గంప రామచంద్రరావు, దుర్గాప్రసాద్, గట్టు సదానందం, కొర్తివాడ రాజేందర్ , జూలూరి సుధాకర్, జగదీశ్వర్ శ్రీనివాస్ , శివ, అశోక్ లు మాట్లాడుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆశీస్సులతో నిర్వహించే ఈ ఉత్సవంలో జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణశర్మ , మున్సిపల్ ఛైర్ పర్సన్ కడవేర్గు మంజుల, ఎమ్మెల్సీలు కూర రగోతం రెడ్డి , దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, ఎమ్మెల్యే బీగాల గణేష్ , రాష్ట్ర టూరిజం శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ట్రస్టు ద్వారా నిర్వహించే కన్వెన్షన్ నుంచి వచ్చే ఆదాయాన్ని పేద ఆర్య వైశ్య వర్గానికి చెందిన వారికి విద్య , వైద్యములతో పాటు సామాజిక సేవా కార్యక్రమం కోసం వినియోగిస్తామని ప్రకటించారు.