23.7 C
Hyderabad
Wednesday, July 2, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని నిరసిస్తూ బోగిమంట

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని నిరసిస్తూ బోగిమంట

*విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని నిరసిస్తూ బోగిమంట*
*బోగిమంటల్లో ఒక కట్టె వేసి మోడీ విధానాన్ని తిప్పికొట్టండి*
*_ ప్రజలకు ప్రజాసంఘాలు పిలుపు*
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను మోడీ ప్రభుత్వం అమ్మడాన్ని నిరసిస్తూ శుక్రవారం మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియం జంక్షన్‌లో ప్రజాసంఘాలు బోగిమంట ఏర్పాటు చేసాయి. సిఐటియు, ఐద్వా, డివైఎఫ్‌ఐ, ప్రజానాట్యమండలి, వార్వా, నివాస్‌, ఎస్‌.ఎఫ్‌.ఐ తదితర సంఘాలు, కాలనీ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని భోగిమంటలో ఒక్కో కట్టె వేసి సేవ్‌ స్టీల్‌ప్లాంట్‌, స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం, ప్లాంట్‌ అమ్మకం ఆపాలి, అమ్మేదెవడురా` కొనేదెవడురా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, పబ్లిక్‌ సెక్టార్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ కో కన్వీనర్‌ కె.ఎం.కుమార్‌ మంగళం మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించి రెండేళ్లు అవుతోందన్నారు. నాటి నుండి నేటి వరకు స్టీల్‌ప్లాంట్‌ రక్షణకోసం ప్రజాసంఘాలు, కార్మికసంఘాలు ఐక్యంగా ప్రజలను, కార్మికులను కదిలించి ఉద్యమిస్తున్నారని గుర్తుచేసారు. ఈ ఏడాది ప్రజా ఉద్యమంగా మలిచేందుకు సంక్రాంతికి ముగ్గులు వేసి సేవ్‌ స్టీల్‌ప్లాంట్‌ నినాదాలు వ్రాయాలని సిఐటియు పిలుపునిస్తే దానిని ప్రజలు అందిపుచ్చుకున్నారన్నారు. భోగి మంటల్లో కూడా ప్రతి ఇంటి నుండి ఒక కట్టె, పిడక వేసి మోడీ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. భోగిమంటల్లో కట్టెలు వేసి నిరసన తెలపాలన్న ప్రచారం ఇప్పటికే సోషల్‌మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళిందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ అమ్మే ప్రతిచర్యను ప్లాంట్‌ కార్మికులు, విశాఖ ప్రజలు తిప్పికొడుతున్నారని తెలిపారు. ప్లాంట్‌ అమ్మకపు బాధ్యత బిజెపి ప్రభుత్వం ఆ పార్టీ ఎంపి జివిఎల్‌ నరసింహరావుకు అప్పగించడంతో విశాఖకు తరుచూ వస్తున్నారన్నారన్నారు. ప్లాంట్‌ ప్రైవేట్‌పరం అయితే బిజెపిని, ఆ నాయకులను ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమని నాయకులు హెచ్చరించారు. ప్లాంట్‌ ఉత్పత్తిని తగ్గించి తద్వారా నష్టాలనే భూతాన్ని చూపి అమ్మేసే చర్యలు విశాఖపట్నంలో చెల్లవన్నారు. ఈ చర్యలు ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించి స్టీల్‌ప్లాంట్‌ను, ఆంధ్రరాష్ట్రాన్ని కాపాడుకుంటారని స్పష్టం చేసారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.మణి, ఎ.సీతాలక్ష్మి, పి.వెంకటరావు, జె.ఆర్‌.నాయుడు, శ్రీను, వరలక్ష్మి, ఐద్వా నాయకులు కె.కుమారి, లలిత, డివైఎఫ్‌ఐ నాయకులు తులసీ, కె.జె.రావు శివ, వార్వా, పెన్షనర్స్‌ నాయకులు వి.తులసీరాం, చలపతి, త్రినాదరావు, దేముడు, అప్పారావు, ప్రదీప్‌, పిఎన్‌ఎం నాయకులు ఎం.చంటి, పివి రమణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్