ఆత్మహత్య కు పాల్పడబోతున్న వృద్ధురాలిని కాపాడిన పోలీసు
యధార్థవాది ప్రతినిధి పల్నాడు
ఆత్మహత్యకు పాల్పడబోతున్న వృద్ధురాలిని ముప్పాళ్ల పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మక్కెన మాధవరావు కాపాడారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చాగంటివారి పాలెం గ్రామానికి చెందిన 70 సంవత్సరాల వయస్సు గల వృద్ధురాలైనా ధర్మరాజుల సుబ్బులు కొడుకులు పట్టించుకోని చూసుకోవడం లేదని ఈ వయస్సులో పనికి పంపిస్తున్నారనే కారణంతో మనస్తాపం చెంది ఎన్ఎస్పీ కార్యాలయం వద్ద గల పెదనందిపాడు కెనాల్ దూకింది.ఎస్ఐ పట్టాభిరామయ్య ద్వారా సమాచారం తెలుసుకున్న స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మక్కెన మాధవరావు వెంటనే స్పందించి గంటసేపు కాలవలో వెతికి కాలవ అనుకుని ఉన్న తూటికరలో ఇరుకుపోయిన సుబ్బులు ను కాపాడారు.ఈ సందర్భంగా సుబ్బులు ను స్టేషన్ తీసుకువచ్చి కొడుకులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్లు పోలీసులు తెలిపారు.తక్షణమే స్పందించి సుబ్బులు ను కాపాడిన స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మాధవరావు ను స్థానికులు అభినందించారు.