శుభ్రత పరిశుభ్రతతో మలేరియాను అరికట్టవచ్చు: జిల్లా వైద్యాధికారి
సిరిసిల్ల యదార్థవాది
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భముగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఎ.సుమన్ మోహన్ రావు సమావేశం నిర్వహించి ర్యాలీ చేపట్టరు.. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణల ద్వారా సున్నా మలేరియాను చేరుకొనుటకు సమయం అసన్నమైదని ”అనాఫిలిస్” దోమ ద్వారా మలేరియా వ్యాధి వ్యాప్తిస్తుందని, దోమల నివారణ కొరకు దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలని, ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు నీటి తోట్ల మీద మూతలు పెట్టాలని అన్నారు. ప్రతి రోజు డ్రై డే గా, పొడి దినముగా పాటించి నీటి నిలువలు అన్నీ శుబ్రపరచి, అరబెట్టి తిరిగి నింపుకోవాలని దోమ తెరలను వాడటం అలవరచుకోవాలని వర్షాలకు ముందు తరువాత మురికి కాలువలలో పూడిక తీత చేపట్టి నీరు పారునాట్లుగా చూడాలని, వ్యాధులు ప్రబలినప్పుడు, స్థానిక ఆరోగ్య సిబ్బందికి వెంటేనే సంప్రదించాలని వారి సలహాలు, సూచనలు పాటించాలని, మలేరియా వ్యాధిగ్రస్తులను గుర్తించి, రక్త పరీక్షల ద్వారా నిర్ధారణ చేసి చికిత్స కు తగిన ఏర్పాట్లు చేసుకోవడం, వ్యాధి ప్రబలిన చోట నియంత్రణ మందులు చల్లడం పొగబెట్టడం వంటి మొదలగు నివారణ చర్యల ద్వారా మలేరియా వ్యాధిని అరికట్ట వచ్చని ఆయన అన్నారు. సమావేశంలో డా. బి. శ్రీరాములు, జిల్లా ప్రోగ్రాం అధికారి, జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. మురళీధర్ రావు, డా,నయిమా, ఏ. వో. శ్రీనివాస్, డి. పి. ఏం. వో లు కాశీనాథం, సురేష్, ప్రతాపరెడ్డి, లింగం, బాలయ్య, భూమయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.