29.9 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్తెలంగాణసమగ్ర సర్వే చేయకుండానే అనర్హుల కే డబుల్ ఇళ్ళు

సమగ్ర సర్వే చేయకుండానే అనర్హుల కే డబుల్ ఇళ్ళు

సమగ్ర సర్వే చేయకుండానే అనర్హుల కే డబుల్ ఇళ్ళు

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

ప్రభుత్వం కట్టి ఇస్తున్న రెండు పలకల ఇండ్లు జాబితాలో అనేక అవకతవకలు జరిగాయని అర్హూలకు ఇండ్లు కేటాయింపు చేయకుండా అనర్హులకు కేటాయింపు చేయడంపై భారత కమ్యూనిస్టుపార్టీ సిపిఐ మొదటి నుండి అధికారుల తీరును తప్పు పడుతూనే ఉందని జిల్లా అధికారులు సమగ్ర సర్వే చేయకుండానే రెండు పడకల గదులను బీఆర్ఎస్ నాయకులు చెప్పిన వారికి అధికారులు మొదటి, రెండవ విడతలో కేటాయించారని ఆ కేటాయింపులు రద్దుచేసి మరోసారి సర్వే చేయాలని జిల్లా ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఎందుకు విచారణ జరిపించ కుండా కాలయాపన చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని గడిపె మల్లేశ్
అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక జిల్లాలో ఇలా ఉంటే రాష్ట్రంలో ఎలా ఉంటుందో.. కేటీఆర్ తో రెండు పడకల ఇండ్ల ప్రారంభోత్సవాలు చేయించడం కోసం సర్వం సిద్ధం చూస్తున్న అధికారులు.. ఇప్పటికైనా మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే సతీష్, జిల్లా అధికారులు సమగ్రమైన విచారణ చేపట్టి నిరుపేదలకు మంజూరు చేయాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కొహెడ కొమురయ్య, హుస్నాబాద్ మండల కార్యదర్శి అయిలేని సంజివరెడ్డి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జనగాం రాజు కుమార్, సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి,ఎండి కుధురత్ అలీ, అందే సంపత్, మహిళా సమాఖ్య నాయకురాలు రాయిళ్ళ శోభ, పోన్నల స్వప్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్