24.1 C
Hyderabad
Wednesday, July 2, 2025
హోమ్తెలంగాణసమాజ సేవలో బాల వికాస ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి

సమాజ సేవలో బాల వికాస ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి

సమాజ సేవలో బాల వికాస ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్: యదార్థవాది ప్రతినిది

బాల వికాస సంస్థ స్పూర్తితో ప్రభుత్వం కూడా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టిందాని గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.. బాల వికాస సమాజ అభివృద్ధి పథకాల నాయకుల జాతీయ స్థాయి మహాసభలో సోమవారం మంత్రి మాట్లాడుతూ సమాజ సేవలో బాల వికాస సంస్థ ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు ఆదర్శం అని, సామజిక సేవలో నంబర్ వన్ గా ఉందని అన్నారు. 40 ఏళ్ల నుంచి బాల వికాస సంస్థతో నాకు అనుబందం ఉందని మంత్గురి గుర్తుచేసుకున్నారు. బాల వికాస సంస్థ స్పూర్తితో ప్రభుత్వం కూడా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టింది అన్నారు. సంస్థ వ్యవస్థాకురాలు బాల థెరీసా సింగారెడ్డి (బాలక్క) వర్ధన్నపేట, రెడ్డిపాలెంలో పుట్టి కెనడాకు వెళ్లి ఆండ్రే జింగ్రాస్ ను వివాహమాడి, ఆయన అక్కడి డబ్బులు తెచ్చి ఇక్కడ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. మహిళల్లో చైతన్యం కల్పించి , సంఘాలు పెట్టీ ఆర్థిక చేయూత నివ్వడం ద్వారా వారికి ఆత్మ విశ్వాసంతో నిపారని, వీరిని అప్పుడు ఎన్టీ రామారావు డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చారని, స్త్రీ నిధి, డ్వాక్రా వంటి సంస్థల ద్వారా మహిళలు ఆర్ధికంగా బల పడ్డారని, వీటికి స్ఫూర్తి బాల వికాస సంస్థ అని ఈ రోజు సాగర్వంగా తెలుపుతున్న అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ది సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీ, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరెడ్డి సింగారెడ్డి, ఇతర ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్