30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్సమిష్టి కృషితో కళింగుల సమస్యలు పరిష్కారం: తమ్మినేని సీతారాం

సమిష్టి కృషితో కళింగుల సమస్యలు పరిష్కారం: తమ్మినేని సీతారాం

సమిష్టి కృషితో కళింగుల సమస్యలు పరిష్కారం: తమ్మినేని సీతారాం

యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం

విశాఖ జిల్లా కళింగ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళింగ కులస్తులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని సీతారాం తేలిపారు. ఉదయ గోదావరి జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో కళింగ అసోసియేషన్లు ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో ఉన్న కళింగలు సమస్యలను అసోసియేషన్ తెలియజేయాలని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి ప్రబుత్వం తరుపున అన్నిసహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. కళింగ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పేడాడ రమణకుమారిని సీతారాం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి పిరియా విజయ, మాజీ కేంద్ర మంత్రి కిళ్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్, మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి బాబ్జి, పోలీస్ అధికారులు, న్యాయమూర్తులు, ప్రముఖ వైద్యులు,వివిధ రాజకీయ పార్టీ నాయకులు, రెవిన్యూ అధికారులు, ప్రముఖ న్యాయవాదులు, వివిధ ప్రభుత్వ,కళింగ కుటుంబ సభ్యుల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్