కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
సిద్దిపేట జిల్లా కేంద్రం స్థానిక 23వ వార్డులోని మంత్రి హరీష్ రావు ఇంట్లో సోమవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ నాయకం లక్ష్మణ్ తో కలిసి ప్రారంభించిన స్థానిక మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్సు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని మనకున్న అన్ని అవయవాల్లో అత్యంత ముఖ్యమైనది మన కండ్లు అటువంటి ముఖ్యమైన అవయవాలు ఎటువంటి వ్యాధిన పడకూడదని ఒకవేళ వ్యాధి ఏదైనా సోకితే దానిని ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం కంటి వెలుగు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో దేశంలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ప్రవేశ పెట్టని పథకం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి అద్దాలు ఉచితంగా అందించి,ఈ వైద్య పరీక్షల్లో ఎవరికైనా తీవ్రమైన కంటే జబ్బులు ఉన్నట్టు తేలితే వైద్యులు ప్రత్యేక శ్రద్ధతో ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా నిర్వహించి
పూర్తి ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తున్నారని ఇటువంటి కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.అనంతరం స్థానిక కౌన్సిలర్ నాయకుం లక్ష్మణ్ మాట్లాడుతూ వైద్య పరీక్షల్లో ఆపరేషన్ తప్పనిసరి అని తేలితే ఆపరేషన్ చేయించుకోవాలని ఈ ఆపరేషన్లు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారని సకల సౌకర్యాలతో ఆపరేషన్లు చేయించి ఇంటికి క్షేమంగా పంపించే బాధ్యత తమదేనని తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి శిబిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, స్థానిక వార్డు అధ్యక్షులు రాచబోయిన యాదగిరి, బిసి సెల్ సెక్రటరీ పబ్బోజు దయాకర్ చారి,నాయకం కరుణాకర్,యూత్ అధ్యక్షుడు పల్లె చంద్రశేఖర్ గౌడ్,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లోక లక్ష్మీరాజం,అధిక లింగం గౌడ్,SC సెల్ సెక్రటరీ పింజర అశోక్ కుమార్,సానిటరీ ఇన్స్పెక్టర్ వనిత, అంగన్వాడి టీచర్ వనిత, ఆర్పి లావణ్య, జవాన్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.