30.2 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్తెలంగాణసామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది: ఎమ్మెల్యే సతీష్ బాబు

సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది: ఎమ్మెల్యే సతీష్ బాబు

సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది: ఎమ్మెల్యే సతీష్ బాబు

యదార్థవాది హుస్నాబాద్ ప్రతినిది

కోహెడ మండలానికి 108 అంబులెన్స్ వాహనాన్ని అడిగినా వెంటనే అంబులెన్స్ వాహనాన్ని మంజూరు చేసిన మంత్రి హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్.. బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ ప్రారంబించి మాట్లాడుతూ గత కొన్ని నెలల క్రితం మంత్రి కోహెడకు వచ్చిన సందర్భంగా 108 అంబులెన్స్ వాహనాన్ని మండలానికి మంజూరు చేయాలని కోరామని నేడు అంబులెన్స్ కల నేడు సహకారమైందని తెలిపారు. మండల కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో అంబులెన్స్ సేవలు అందుతాయని సామాన్య ప్రజల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలో లేనటువంటి పథకాలను మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిందని ఉచిత మందుల పంపిణీ, డయాగ్నస్టిక్ సేవలు, వివిధ పరీక్షల కోసం ల్యాబ్ లు, డాక్టర్లు సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నారని, గత ప్రభుత్వంలో ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాలంటేనే నేను రాను బిడ్డో సర్ కారు దావకానకు అంటూ వనికి పోయే జనం నేడు స్వరాష్ట్రంలో నేను సర్కారు దావకానకే వెళ్తా అనే విధంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరిగిందని ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వారికి ఎల్లప్పుడూ తోడ్పాటుగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోహెడ గ్రామపంచాయతీకి మంజూరైన 23 రకాల క్రీడా వస్తువులను స్థానిక సర్పంచ్ పేర్యాల నవ్యకు అందిస్తూ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ఈ క్రీడా వస్తువులు ప్రభుత్వం నుండి అందించబడతాయని తెలిపారు. యువ క్రీడాకారుల కోసం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకున్నామని క్రీడా వస్తువుల ఉపయోగించుకుని వివిధ రకాల క్రీడల్లో రాణించాలని యువతకు ప్రోత్సాహం అందించాలని సూచించారు.అనంతరం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా కోహెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను పర్యవేక్షించి,డిజిటల్ విద్యాబోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల లను డిజిటల్ బోర్డులు, ఫర్నిచర్ డైనింగ్ కిచెన్ రూమ్,టాయిలెట్స్,ప్రహరీ గోడలు కార్పొరేట్ స్థాయిలో ఉండే విధంగా సౌకర్యాలు కల్పిస్తూ, ఇంగ్లీష్ మీడియంలో చదివే ఒక విద్యార్థికి రూ.1,50,000 ఖర్చు చేస్తుందని ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ బడులలో చదివేవారు చాలా తక్కువ అని నేడు దానికి భిన్నంగా ప్రతి పాఠశాలలో పూర్తిస్థాయి విద్యార్థులతో కలకల్లాడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి,ఎంపీపీ కొక్కుల కీర్తి,సర్పంచ్ పేర్యాల నవ్య,ప్యాక్స్ చైర్మన్ దేవేందర్ రావు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్