సామూహిక వివాహ మహోత్సవంలో పాల్గొన్న తెలంగాణ తలైవ
యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి
నాగర్ కర్నూల్ ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ మహోత్సవాలు ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. 202 జంటలకు ఒకే వేదికపై వివాహాలు జరిపించడం ఇది ఐదవ సారి. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం మేరకు జిల్లా ప్రముఖ వ్యాపారవేత్త, మన ఊరు- మన బడి ఆద్యుడు జిల్లా ప్రముఖ సామాజిక సేవకుడు తెలంగాణ తలైవగా పిలుచుకునే తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. వివాహమైన నూతన వధూవరులను అక్షంతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడారు. ఎంజెఆర్ ట్రస్ట్ వారు నిర్వహించే సామూహిక వివాహ మహోత్సవాలు సాక్షాత్తు తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలను తలపిస్తున్నాయని ఉదహరించారు. సత్యం పవిత్రత స్వార్థరహితమైనటువంటి ప్రేమ దేనినైనా జయించేలా చేస్తాయని తెలుపుతూ, మానవసేవయే మాధవ సేవ అని తన నిరాడంబరత్వాన్ని చాటారు.