సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ
సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 : బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం సిద్దిపేట పట్టణంలో ఉదయం 10:00 గంటల నుండి 12:00 గంటల వరకు నాలుగు కిలోమీటర్ల మేర మహా కరుణ మెగా శాకాహార ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షుడు ధ్యాన గద్దర్ భూపతి రాజు తెలిపారు. అనంతరం తాడూరి బాలా గౌడ్ ఫంక్షన్ హాల్ లో జరిగే ధ్యాన మహాసభ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమాల్లో సుమారు 2000 మంది ధ్యానులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడుఈశ్వరయ్య, ఉపాధ్యక్షుడు వీరేశం, బాలయ్య, సభ్యులు రామచంద్రం రెడ్డి, వెంకటేశo తదితరులు పాల్గొన్నారు.