సిద్దిపేట కమిషనరేట్ ను సందర్శించిన రాజన్న సిరిసిల్ల జోన్ డీఐజీ కె. రమేష్ నాయుడు..
యదార్థవాది ప్రతినిది సిద్దిపేట
రాజన్న సిరిసిల్ల జోన్ డీఐజీ కె. రమేష్ నాయుడు మంగళవారం సిద్దిపేట కమిషనరేట్ కార్యాలయాన్ని సందర్శించారు.. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మొక్కను డీఐజీ కె. రమేష్ నాయుడు అందచేసి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధి సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్స్ మరియు జిల్లాలో ఉన్న సర్కిల్స్, పోలీస్ స్టేషన్ ల గురించి శాసన సభ్యుల నియోజకవర్గాల పరిధి గురించి, మరియు జిల్లా భౌగోళిక పరిధి, గురించి వివరించారు.. డిఐజి రమేష్ నాయుడు అధికారులతో సమావేశమై జిల్లాలో ఏ తరపు నేరాలు జరుగుతున్నాయని, మరియు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల గురించి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ ఎలక్షన్ ఇయర్స్ ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని ఏదైనా బందోబస్తు నిర్వహించేటప్పుడు పోలీస్ అధికారులకు సిబ్బందికి బ్రీఫింగ్ ఇవ్వాలని, బందోబస్తు ముగిసిన తర్వాత డీ బ్రీఫింగ్ ఇవ్వాలని తెలిపారు. దొంగతనాల కేసులను ఛేదించి ప్రాపర్టీ రికవరీ శాతం పెంచాలని, కేసుల్లో శిక్షల శాతం పెంచి ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలని. గ్రేవ్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులలో పరిశోధన సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ వేయాలని తెలిపారు. శాంతిభద్రతలను పరిరక్షించడానికి సిద్దిపేట కమిషనర్ పర్యవేక్షణలో పోలీసులు విజయవంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు, కమిషనరేట్ కార్యాలయం పచ్చదనం పరిశుభ్రతతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నదని, పోలీసుల పనితీరు బాగుందని పోలీస్ అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామచంద్రరావు సుభాష్ చంద్రబోస్, గజ్వేల్ ఏసిపి రమేష్, ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్, హుస్నాబాద్ ఏసిపి సతీష్, ఎస్బిఎసిపి రవీందర్ రాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ కుమార్, సీఐలు, ఆర్ఐలు, ఏఓ యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

