సిని నటిమణి జెమున మరణం సిని కళా రంగానికి తీరని లోటు.
యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్
అలనాటి సిని నటి మణి జమున చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతునమ శుక్రవారం మరణించారని టివి, రేడియో జానపద గాయకులు గడిపె మల్లేశ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమున హుస్నాబాద్ బాలుర ఉన్నత పాఠశాల లొ జరిగిన బహిరంగ సభకు వచ్చిన సందర్భంగా జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు అత్యంత తీరని లోటన్నారు. వందల చిత్రాల్లో నటించి తెలుగువారి అభిమాన తారగా వెలుగొందారని తెలుగుతోపాటు కన్నడ,తమిళ, హిందీ భాషల్లో ఎన్నో వైవిధ్య భరితమైన చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకాభిమానాన్ని జెమున పొందారన్నారు. జెమున ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి కళాకారిణిగా అభ్యుదయ భావాలు కలిగిన జెమున సినీ నటిగా కళా సేవకే పరిమితం కాకుండా ఎంపి గా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు ప్రేక్షకుల హృదయాల్లో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న జమున ఆత్మకు శాంతి కలగాలని గడిపె మల్లేశ్ అన్నారు. సంతాపం తెలిపిన వారిలొ హుస్నాబాద్ ప్రాంత కళాకారులు వరుకొలు కళా చందర్, నన్నే అజయ్ కుమార్, పిట్టల తిరుపతి, గజ్జేల కనకయ్య, కునుసోత్ భద్రు నాయక్, తిప్తర్తి శ్రీనివాస్, జాల ఆగయ్య, ఖాత ఏలీష్, కర్కాల శంకర్, కె.యస్ చారి,నారోజు చంద్రమౌళి,
వలువోజు జగదీశ్వరా చారి,దుడ్డేల సమ్మయ్య, గుగులొతు స్వామి నాయక్, బత్తుల బాబు,
చెంచెల తిరుపతి, చింతకింది కుమార్, తదితరులు సంతాపం తెలిపారు.