సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండలి.
దుబ్బాక యదార్థవాది ప్రతినిది
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల క్షేత్రస్థాయిలో 2, 17 వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన చేస్తున్న చైర్ పర్సన్ గన్నే వనిత..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్ జ్వరాలు, దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులపై, నీటి నిల్వ ఉన్న కుండీలలో వర్షపు నీటి ద్వారా దోమలు గుడ్లు పెట్టి ఉత్పత్తి అయి డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలు ప్రబలుతాయని వార్డు ప్రజలకు తెలియజేశారు. ప్రజలు ఇంటి చుట్టు ప్రక్కల పారిశుద్ధ్య సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్ పులిగారి కల్పన, గోనేపల్లి దేవలక్ష్మీ బీఆర్ఎస్ నాయకులు భూమ్ రెడ్డి, ఎల్లం, ఆర్పీ లావణ్య, అంగన్వాడీ టీచర్ సుజాత, సమాఖ్య సభ్యులు, ఆశ వర్కర్లు, ఆర్పిలు వార్డు ప్రజలు పాల్గొన్నారు..