30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్జాతీయసైన్స్ పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించు కోవాలి

సైన్స్ పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించు కోవాలి

సైన్స్ పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించు కోవాలి

-జనవిజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్ బూట్ల రాజ మల్లయ్య

హుస్నాబాద్ యదార్థవాది

మన విశ్వంలో జరిగే మార్పులపై విద్యార్థిని, విద్యార్థులు ప్రజలు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని జనవిజ్ఞాన వేదిక సిద్దిపేట జిల్లా శాఖ కన్వీనర్ బూట్ల రాజమల్లయ్య పిలుపునిచ్చారు.. మంగళవారం తెలంగాణ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో సంవత్సరంలో ఒక రోజు జీరో షాడో ఏర్పడుతుండగా ఈసారి హైదరాబాదు పరిసర ప్రాంతాలలో జీరో షాడో ఏర్పడిందని హుస్నాబాద్ పట్టణంలో ఓ ఇంటి మిద్దె పైన మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషముల నుండి 14 నిమిషాల పాటు ఒక పీటపై రోకలిబండ ను నిలువుగా ఏర్పాటు చేసి జీరో షాడోను చిత్రీకరించడం జరిగిందని ఆయన తెలిపారు. సైన్స్ పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించుకొని విశ్వంలో జరిగే మార్పులను మూఢనమ్మకాలతో చూడకుండా సత్యమును గ్రహించి ప్రజలు సమాజ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్