సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక చర్యలు: సి.పి. ఎన్ శ్వేత
యదార్థవాది ప్రతినిది సిద్దిపేట
సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో రోజు ఏరకమైన సైబర్ నేరాలు జరుగుతున్నాయో పత్రికా ద్వారా తెలియజేస్తాం. ఈ సందర్భంగా పోలిస్ కమిషనర్ ఎన్ శ్వేత మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారని, ఏదైనా ఆశ చూపించి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపి అతని నుండి వ్యక్తిగత సమాచారం తీసుకుని సైబర్ నేరం చేయడం జరుగుతుందని, వ్యక్తికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ కానీ, పాన్ కార్డు కానీ, ఇతర అకౌంట్లు బ్లాక్ అవుతుందని భయపెట్టి వారి నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకొని సైబర్ నేరం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ ఉపయోగం పెరగడం వల్ల ప్రతి వ్యక్తి ఏదో అవసరానికి ఫోన్లు వాడడం జరుగుతుందని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదని సైబర్ నేరగాళ్లు అవకాశాల కోసం వేచి చూస్తారని ఫోన్లు జాగ్రత్తగా ఉండాలని ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చుని తెలిపారు.
శనివారం సిద్దిపేట జిల్లా పోలీస్ స్టేషన్ ల పరిధిలో జరిగిన సైబర్ నేరాల వివరాలు.
(SMS Fraud) ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి పాన్ కార్డు అప్డేట్ చేసుకోమని మెసేజ్ రాగా బాధితుడు లింకునీ క్లిక్ చేయగా బాధితుని అకౌంట్ నుంచి నుంచి 44,997 రూపాయిలు దొంగలించారని, (Trading fraud)సిద్దిపేట రూరల్ పరిధిలో బాధితునికి క్రిప్టో కరెన్సీ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు రెండింతలు వస్తాయని చెప్పగా బాధితుడు సైబర్ నేరస్తులకి 43000 వేల రూపాయలు పంపించినాడు మరల ఫోన్ చేయగా అతని నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.
(Honey Trap) సిద్దిపేట టూ టౌన్ పరిధిలోని బాధితునికి మీ ఇంస్టాగ్రామ్ లో పరిచయమై వాట్సాప్ లో నంబర్ ఎక్సేంజ్ చేసుకొని సైబర్ నేరస్థుడు బాధితునికి న్యూడ్ కాల్ చేసి రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసి 4000 రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. కావున పై విధంగా ఎవరు ఫోన్ చేసి చెప్పినా సైబర్ నేరస్తులని గుర్తించి వారికి ఏ విధమైన సమాచారం ఇవ్వద్దని కమిషనర్ ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.