స్నేహమంటే ఇదేరా..
దివ్యాంగుడైన స్నేహితునికి 30 వేల రూపాయల ఆర్థిక సహాయం..
హుస్నాబాద్ యదార్థవాది
సుమారు 21 సంవత్సరాల తర్వాత మిత్ర బృందం ఏకమైంది ఆపదలో ఉన్న తమ బాల్య మిత్రునికి మిత్ర బృందం అండగా నిలిచింది… సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వజ్రోత్సవాల్లో 2001-02 పదవ తరగతి మిత్ర బృందమంతా కలిశారు. మిత్రులంతా ఏకమై ఆనాటి రోజులను స్మరించుకొని, తమలో ఆపదలో ఉన్న మిత్రులకు చేతనైనంత సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హుస్నాబాద్ లోని ఆరేపల్లికి చెందిన తమ మిత్రుడు పోలు రాజుకు కాలు విరిగి శస్త్ర చికిత్స చేయించుకొని ఇంటివద్దె ఉంటున్నాడని తెలుసుకున్నారు. 90 శాతం దివ్యాంగుడైన పోలురాజుకు అండగా నిలవాలని మిత్రులు భావించారు. మిత్ర బృందామంతా ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని, విషయాన్ని గ్రూప్ లో పోస్ట్ చేశారు. స్పందించిన మిత్రులు తమ మిత్రుడికి తలింత చేయి వేసి ఆదివారం రోజు 30 వేల రూపాయల నగదు, 50 కిలోల బియ్యాన్ని అందించారు. మిత్రుల సహాయానికి పోలు రాజు సంతోషం వ్యక్తం చేశాడు. చాలా రోజుల తర్వాత మిత్రులందరు వచ్చి తనతో మాట్లాడి తనకు అండగా నిలిచినందుకు మిత్రులకు ధన్యవాదాలు తెలిపాడు. భవిష్యత్తులో కూడా మిత్రుడు పోలు రాజుకు అండగా ఉంటామని మిత్రబృందం ధైర్యాన్ని కల్పించింది. ఇందులో మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.