మనకు తెలిసింది ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శి హోదాలో స్మితా సబర్వాల్ పనిచేస్తున్నారని. కానీ ఆమె స్మితం హితం పేరిట తాను ఏర్పాటుచేసిన ఫౌండేషన్ లో కూడా చురుకుగా పని చేస్తారు. చిన్న పిల్లల కోసం ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేశారు. తక్కువ కాలంలోనే మంచి అధికారిగా పేరు సంపాదించుకున్న స్మితాసబర్వాల్ తన పనితీరు ద్వారా తనదైన మార్క్ తో ముందుకు వెళ్తారు. కరీంనగర్ కలెక్టర్ గారు ఎన్నో సేవలు అందించారు. ఆ తర్వాత మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆమె పనితీరుతో ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శి పదోన్నతి లభించింది.