స్వచ్ఛ ఆరోగ్యమే మన లక్ష్యం.!
– ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థులకు ల్యాప్ ట్యాబ్స్ పంపిణీ..
– బిల్డింగ్ వర్కర్లకు కుట్టు మిషన్ల పంపిణీ..
సిద్ధిపేట యదార్థవాది ప్రతినిది
మహిళల ఆరోగ్య రక్షణ కోసమై, మహిళ అడుగు రుతుప్రేమ యాప్ ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విపంచి ఆడిటోరియంలో గురువారం రుతుప్రేమ యాప్ ప్రారంభోత్సవంలో హాజరై ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, పోలీసు కమిషనర్ శ్వేత, జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, మున్సిపల్ చైర్మన్ మంజుల, జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మంత్రి మాట్లాడారు. మానవ మనడగకు మూల కారణం రుతుచక్రం, మానవ మనుగడను శాసించేది రుతుచక్రమని, రుతుచక్రం లేకుంటే జీవన చక్రమే లేదని, సంపూర్ణ స్వచ్ఛ ఆరోగ్య మన సిద్ధిపేట నియోజకవర్గ వర్గంలో పూర్తి చేశామని మంత్రి అన్నారు. సెట్విన్ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషను శిక్షణ తీసుకున్న 200మందికి కుట్టు మిషన్లు అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఐరన్ లోపంతో బాధపడుతున్న కౌమార బాలికలకు బలవర్థకమైన ఆహార పదార్థాలు అందజేతలో భాగంగా ఐరన్ కంటెంట్ తక్కువ ఉన్న 54 మంది విద్యార్థినీలకు 7శాతం కంటే తక్కువ ఐరన్ కంటెంట్ ఉన్నవారికి పోషకాహార కిట్స్ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ గురుకుల పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు 100 మందికి ల్యాప్ ట్యాప్ లు అందిస్తున్నట్లు, రాబోయే రోజుల్లో మరో 900 మందికి అందిస్తామని భరోసా ఇచ్చారు. అంతకు ముందు జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ 2021లో రుతుప్రేమను ప్రారంభించి సిద్ధిపేటలోని అన్నీ మున్సిపాలిటీ వార్డుల్లో, నియోజకవర్గ పరిధిలోని 91 గ్రామ పంచాయతీలలో 1 లక్ష 33 వేల మందికి అవగాహన కల్పించామని తెలిపారు. అలాగే 53 వేల 067 మంది మహిళలకు రుతుప్రేమ మెన్స్ట్రువల్ కప్పులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, డీపీఓ దేవకి, బీసీ కార్పోరేషన్ ఈడీ సరోజ, సెట్విన్ అమీనా, జిల్లా అధికార యంత్రాంగం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.