21.7 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణహుజురాబాద్ బైపోల్ పోరులో విజయం ఎవరిదో....?

హుజురాబాద్ బైపోల్ పోరులో విజయం ఎవరిదో….?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉప ఎన్నిక కు రేపే కౌంటింగ్… హుజురాబాద్ కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు… ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ బైపోల్ కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నవంబర్ 2న ఉదయం 8 గంటలకు కరీంనగర్ SRR డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ మొదలు కానుంది. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. మొత్తం 753 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు రెండు హాల్స్ లో కౌంటింగ్ జరగనుంది… ఒక్క హాళ్లో 7 టేబుళ్ల చొప్పున ప్రతి రౌండ్ కు14 టేబుల్స్ పై 14 ఈవీఎలను లెక్కిస్తారు. మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది.. ఇది ఇలా ఉండగా ఈ ఎన్నికలు దేశంలోనే అత్యంత కాస్ట్లీ ఎన్నికల గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో పారిన డబ్బుల వరద ఒకవైపు అధికార పార్టీకి ప్రజలు పట్టం కడతారా లేక వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇస్తారా అనేది తేలనుంది. ఏదేమైనా నా ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఒక భారీ మార్పుకు అవకాశం కల్పించే విధంగా గా ఉన్నాయి. అని అని చెప్పక తప్పదు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్