హుజురాబాద్ లో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే 20 కంపెనీల బలగాల లు కేంద్రం కేటాయించింది. వీరిలో ఇప్పటికే హుజరాబాద్ చేరుకొని భద్రతను పెంచాయి ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లపై కరీంనగర్ హనుమకొండ అ జిల్లా కలెక్టర్లు ఎన్నికల అధికారులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని మద్యం నగదు పంపిణీ పై క్షేత్రస్థాయిలో మరింత నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని కరోనా నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు