29.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణహుస్నాబాద్ లో ఇంటింటి ప్రచారంలో మాజీ మంత్రి ఈటెల

హుస్నాబాద్ లో ఇంటింటి ప్రచారంలో మాజీ మంత్రి ఈటెల

హుస్నాబాద్ లో ఇంటింటి ప్రచారంలో
మాజీ మంత్రి ఈటెల

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి

నరేంద్ర మోదీ గారి 9 సం.ల పాలన పూర్తయిన సందర్భంగా మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పలు పండ్ల షాపుల్లో తిరిగి బిజెపి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9 సం.ల పాలన పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, సెన్సార్ బోర్డు మెంబర్ లక్కిరెడ్డి తిరుమల, జిల్లా కోశాధికారి, కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, కౌన్సిలర్ మ్యాదరబోయిన వేణు యాదవ్, హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, మండల అధ్యక్షులు చెక్కబండి విద్యాసాగర్ రెడ్డి, గోళ్లపల్లి వీరాచారి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తోట స్వరూప, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్