ఈనెల 11న రాష్ట్రపతి భవన్లో 51వ గవర్నర్ల సదస్సు జరగనుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో జరుగుతున్న నాలుగవ సదస్సు ఇది.