18న గజ్వెల్ కృతజ్ఞతాసమావేశం
గజ్వేల్ యదార్థవాది ప్రతినిధి
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లా గజ్వెల్ నుండి మూడోసారి శాసనసభ్యునిగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా సాధించిన సందర్బంగా నియోజక వర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞత సమావేశం ఈ నెల18న గజ్వెల్ శోభా గార్డెన్ లో సమావేశం ఎర్పాటు జరుతున్నయని కొండపాక మండల బీఅర్ఎస్ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి రైతుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మన ప్రియతమా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపేందుకు వీలుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఈ సమావేశానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆరెస్ జిల్లా మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొంటారని ఆయన అన్నారు.