74 లో డిగ్రీ చేసిన పూర్వ విద్యార్థులతో 50 ఏండ్ల స్వర్ణోత్సవాల వేడుకలు
సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1974లో డిగ్రీ పూర్తి చేసి యాబై సంవత్సరాలు పూర్తయినందున కళాశాలలో స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహించే తల పెట్టామని స్వర్ణోత్సవ సంబరాల వేదిక కమిటీ సభ్యులు హరిశ్చంద్ర తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు అమ్మన చంద్రారెడ్డి, మహిపాల్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడుతూ ఈనెల 20న సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియం ఈ సంవత్సరం సంబరాలకు వేదిక కానుందని, ఈ స్వర్ణోత్సవం సంబరాలు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన కొనసాగుతాయని, 1974లో డిగ్రీ పూర్తి చేసిన అన్ని బ్యాచ్ ల, గ్రూపుల విద్యార్థులు ఈ స్వర్ణోత్సవ సంబరాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 1974లో సిద్దిపేటలో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చదువుకున్నారని ఇప్పుడు ఎక్కడ ఉన్న సంబరాలలో పాల్గొనాలన్నారు. పూర్వ విద్యార్థులకు అధ్యాపకులకు ఈ సందర్భంగా సన్మానం చేస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం కమిటీ సభ్యులను నేరుగా కానీ, ఫోన్ ద్వారా 9618195145 నంబర్ ను సంప్రదించాలని తెలిపారు.