మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో విషాదం.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు మాతృవియోగం. మంత్రి తల్లి శాంతమ్మ (78) కు శుక్రవారం రాత్రి గుండెనొప్పి రావడంతో కన్నుమూశారు.
శనివారం మహబూబ్ నగర్ పట్టణానికి సమీపంలోని మంత్రి గారి వ్యవసాయ క్షేత్రంలో శాంతమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి.