తెలంగాణ రాష్ట్రంలో మరో నేత పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నాయకులు మధుయాష్కిగౌడ్ ఈనెల 14 నుండి 21 వరకు తెలంగాణలో ప్రజా చైతన్య యాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. జాతీయ రాష్ట్ర సమస్యలపై ప్రజలను చైతన్య పరచడానికి మొత్తం రెండు వేల మూడు వందల కిలోమీటర్ల యాత్ర చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 9న కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని మధుయాష్కి పేర్కొన్నారు .