బద్వేల్ లో అధికార పార్టీ వైఎస్ఆర్సిపి అభ్యర్థి డా. సుధ భారీ ఓట్ల ఆధిక్యతతో గెలిపొందారు. అధికార వైసీపీ పార్టీ అభ్యర్థి డా. సుధకు 1,12,211 ఓట్లు పొలవగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సురేష్ కు 21,678 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి కమలమ్మకు 6,235 ఓట్లు వచ్చాయి. చివరి రౌండ్ ముగిసే సరికి వైసీపీ అభ్యర్థి డా.సుధ 90,533 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.