హుజూరాబాద్ లో టిఆర్ఎస్ ఓటమి పాలైనప్పటికీ ప్రజలతోనే ఉండి ప్రజల పక్షాన ప్రజల సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ హుజరాబాద్ లో ఓటమిపై స్పందించారు. ప్రజల పక్షాన టిఆర్ఎస్ నిలిచి ఉంటుందని అన్నారు. టిఆర్ఎస్ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు.