రాష్ట్ర గవర్నర్ తమిలిసై చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం గవర్నర్ కు అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. మరోవైపు ఈ రోజు ఉదయం బీజేపీ నేత లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. దీపావళి పురస్కరించుకొని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.