పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ ఐదు రూపాయలు తగ్గించడం వల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేదని, దాన్ని మరింత తగ్గించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ఇటీవల ఉప ఎన్నికల్లో బిజెపి ఓడిపోవడంతో ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిందని చెప్పారు. అయితే పెట్రోల్ ధర 50 కి దిగిరాకపోతే బిజెపి కచ్చితంగా ఓడిపోతుందని రౌథ్ జోస్యం చెప్పారు.