వాట్సాప్ తన వినియోగదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటివరకు ఉన్న మెసేజ్ డిలీట్ ఫర్ ఎవరీ వన్ టైం లిమిట్ ను పెంచనుంది. దీని ప్రకారం వినియోగదారులు మెసేజ్ పంపిన నెల రోజుల తర్వాత కూడా అవతలి వ్యక్తి చాట్ పేజీ నుంచి మెసేజ్ డిలీట్ చేసే అవకాశం కల్పించనుంది. అయితే ఇది ట్రయల్స్ దశలో ఉండగా త్వరలోనే అందుబాటులోకి రానుంది. కాగా ప్రస్తుతం గంటల లోపు మాత్రమే డిలీట్ ఆప్షన్ ఉంది.