23.7 C
Hyderabad
Thursday, March 13, 2025
హోమ్జాతీయఫ్యూయెల్ ఇంజిన్లన తయారు చేస్తే- మరింతగా తగ్గనున్న పెట్రోల్ ధరలు...!

ఫ్యూయెల్ ఇంజిన్లన తయారు చేస్తే- మరింతగా తగ్గనున్న పెట్రోల్ ధరలు…!

కేంద్ర ప్రభుత్వం దీపావళి రోజున వాహనదారులకు తీపికబురు అందించింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించేసింది. దీంతో దేశవ్యాప్తంగా దేశీ ఇంధన ధరలు దిగొచ్చాయి. పెట్రోల్ పై 5రూ, డీజిల్ పై 10రూ మేర తగ్గింది. కొని రాష్ట్రాల్లో ఇంకా ధరలు ఎక్కువగానే తగ్గాయి. ఇంధన ధరలను మరింత తగ్గించడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. నివేదికల ప్రకారం చూస్తే .. లీటరు పెట్రోల్ 60 కే దొరక వచ్చని, ముడిచమురు దిగుమతులపై ఆధారపడట్టాని తగ్గించుకోవాలని కేంద్రప్రభుత్వం ప్రయసుస్తోంది. దీని కోసం ఇథనాల్ బ్లెండింగు పెంచాలని, దీని ద్వారా దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయెల్ తీసుకురావాలని భావిస్తోంది. దీంతో వాహనదారులకు ఊరట కలుగుతుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ డ్రాఫ్ట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీలు కూడా ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజిన్లన తయారు చేయాల్సి ఉంటుంది.ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కన్నా ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజిన్ల తయారీ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. వీటిల్లో ఇథనాల్, మిథనాల్, గ్యాసోలిన్ వంటి మిక్సింగ్ చేసిన ఫ్యూయెల్స్ కూడా ఉపయోగించొచ్చు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈ అంశానికి సంబంధించి కొత్త బంధనలు తీసుకురనున్నట్లు తెలుస్తుంది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్