దీపావళి సందర్భంగా టపాసులు కాల్చిన సందర్భంలో జరిగిన ప్రమాదాలతో పలువురు ఆసుపత్రుల్లో చేరారు. హైదరాబాదులోని సరోజిని దేవి కంటి ఆసుపత్రి వద్ద గాయాలతో పదుల సంఖ్యలో బాధితులు, చిన్నారులు క్యూకట్టారు. స్వల్పంగా గాయపడిన వారికి చికిత్స చేసి ఇంటికి పంపించగా.. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.