అహ్మద్ నగర్ జిల్లా ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా ఆస్పత్రిలో ఐసీయూలో హఠాత్తుగా మంటలు చెలరేగి పదిమంది కరోనా రోగులు మృతి చెందారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రమాదం సంభవించిన సమయంలో ఐసీయూలో మొత్తం 17 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.