కోవిడ్ కొత్త వేరియంట్లపై.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక…
పలు దేశాల్లో కోవిడ్ కేసులు భారీగా కావడంతో ప్రపంచం కలవరపెడుతోంది. విదేశాల్లో కరోనా కేసుల పెరుగుదలపై భారత్ అప్రమత్తమైంది. కోవిడ్ కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని, పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని తెలిపింది. జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్, చైనాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లను ఇన్సకాగ్ నెట్‌వర్క్ ద్వారా ట్రాక్ చేసేందుకు పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని, కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ వివరించింది, దానికి తగినట్లుగా వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాగలుగుతాం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్‌కేంద్ర వివరించఋ. ప్రజాగ్రహంతో ఇటీవలే కరోనా ఆంక్షలను సడలించింది చైనా. దీంతో రోజువారి కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో ఆ దేశ జనాభాలో 60 శాతం మంది ప్రజలు కోవిడ్ బారినపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 35 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో మంగళవారం 112 కొత్త కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 3,490 ఉన్నాయి.