కేంద్రం ప్రభుత్వం మెడలు వంచాల్సిందే..కొత్త ప్రభాకర్ రెడ్డి
రైతుల వ్యతిరేక మోదీ ప్రభుత్వం కు బుద్ది చెపుతాం
సిద్దిపేట 23 డిసంబర్ 22
తెలంగాణాలో ఉన్న రైతులకు కేంద్రంలో ఉన్న ప్రదాని నరేంద్రమోదీ ప్రభుత్వనికి వ్యతిరేకంగా.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశ వ్యాప్త పోరాటం సాగుస్తామని మెదక్ పార్లమెంటు సభ్యుడు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట లో జరిగిన మహాధర్నా కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమాలు చేశామని, నేడు కేంద్రంకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నామని. దేశంలోనే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందని, ఓర్వ లేకనే మోదీ ప్రభుత్వం కొర్రీలు పెడుతు. సీఎం కేసీఆర్ రైతు బిడ్డ కావడంతో రైతుల కష్టాలు ఎరిగిన వ్యక్తి కావడంతో రైతు సంక్షేమం కోసం, ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, రైతు హిత పథకాలను తెలంగాణ లో అమలవుతోదని తెలిపారు. రైతులు కల్లాలు నిర్మించుకుంటే..నిధులు వాపస్ ఇవ్వాలని అంటున్నారు…ఇదెక్కడి న్యాయం..బీజేపీ ఎంపీ లు ఉన్నారు..ఎం లాభం..ఒక్కరోజు కూడా తెలంగాణ గురుంచి మాట్లాడలేరు. మైకుల ముద్దర మాత్రం ఈ cc రోడ్డు, బాత్రూము లు, కల్లాలు మాయే అంటారు..కేసీఆర్ .హరీశ్ రావు, కేటీఆర్, ను ఓడిస్తా అంటాడు.. తెలంగాణ అభివృద్ధి,సంక్షేమం మిగతా రాష్ట్రాల్లో ఎందుకు లేదని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో రైతులు హరి గోసఘోష పడుతురు, గుజరాత్ లోని రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని, తెలంగాణ తరహా దేశ వ్యాప్తంగా రైతు బాగు పడటానికే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ధర్నాలో జిల్లా పరిషత్ చేర్మెన్ రోజా శర్మ, ఎమేల్సి పారుక్ హుసేన్,జిల్లా నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.