గుడులేని నిరుపెదాలకే డబుల్ బెడ్ రూం ఇండ్లు..ఇవ్వాలి
గుడులేని నిరుపెదాలకే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలి….గడిపె మల్లేశ్
హుస్నాబాద్ 25 డిసంబర్
ప్రభుత్వం ద్వారా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి ఏడ్లు గడిచిపోయినప్పటికి దరఖాస్తులు పెట్టుకున్న లబ్ధిదారులకు నిష్పక్షపాతంగా విచారణ చేసి ఇవ్వలేదని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి,
అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఏజాగ లేని పేదలకు మున్సిపల్ కంప్యూటర్, కుటుంబ సభ్యుల రికార్డులను పరిశీలించిన తర్వాతే లబ్ధిదారులకు ప్రభుత్వం కట్టిచ్చిన రెండు పడకల ఇండ్లును మంజూరి చేయాలని, ఇండ్లు మంజూరి కోసం ఇటివలచేసిన సర్వే తప్పుల తడకగా ఉందని లబ్ధిదారుల తండ్రి, భర్త వయస్సు, కొన్ని పేర్లు రెండు సార్లు, ఇష్టారాజ్యంగా చేశరన్నారు, ఇండ్లు, స్థలాలు ఉన్నావారికి లబ్ధిదారులుగా ఎంపిక చేయడం పట్ల సిపిఐ తరపున నిరసన వ్యక్తం చేస్తున్నమని, మల్లి రిసర్వే చేసి, తప్పుడు సర్వే చేసిన అధికారులపై వెంటనే శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోని అధికారులను కోరారు. పేదల ఫిర్యాదులను స్వీకరించేందుకు మరో 10 రొజుల గడువును ఇవ్వాలని జిల్లా స్థానిక మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ జిల్లా కలెక్టర్ లను గడిపె మల్లేశ్ కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, జనగాం రాజు కుమార్, ఏలురి స్వాతి,కాల్వల ఎల్లయ్య పోగుల నవ్య ,రాయిళ్ళశోభ తదితరులు పాల్గొన్నారు.





