25.7 C
Hyderabad
Friday, March 13, 2026
హోమ్తెలంగాణశగుఫ్తా సైఫ్ ముమ్మాటికీ హత్యే …

శగుఫ్తా సైఫ్ ముమ్మాటికీ హత్యే …

శగుఫ్తా సైఫ్ ముమ్మాటికీ హత్యే …

* కట్నం కోసమే హత్య చేశారు.

సిద్దిపేట 26 డిసంబర్ 22

శగుఫ్తా సైఫ్ ది ఆత్మహత్య కాదు, కట్నం కోసమే మా హత్య చేశారని, శగుఫ్తా సైఫ్ తండ్రి సైఫుద్దీన్ సోమవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. 15 రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని ఖాదర్ పూర కు చెందిన వివాహిత శగుఫ్తా సైఫ్(21) ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి చెందిన సంగతి తెలిసిందే. సిద్దిపేట పట్టణానికి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ రియాజుద్దీన్, శగుఫ్తా సైఫ్ తమ ఏకైక బిడ్డను ఇచ్చి ఘనంగా వివాహం జరిపించామని, కొన్ని నెలలకే కట్నం కోసం తమ బిడ్డను భర్త రియాజ్ టార్చర్ చేశాడన్నారు. రెండు నెలల క్రితం 6 లక్షలు ఇచ్చి, మరో 3 లక్షలు రూపాయలు ఫిక్స్ డిపోసిట్ చేశామని తెలిపారు. చనిపోయే ఒకరోజు ముందుకు తమకు ఫోన్ చేసిందని.. అమ్మాయి శరీరం పై ఎర్రటి గుర్తులు గుర్తించామని ఇది ముమ్మాటికీ భర్త రియాజ్, వారి కుటుంబీకులు చేసిన హత్యేనని, శగుఫ్తా సైఫ్ మృతి పై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించకుండానే మృతదేహాన్ని క్రిందకు దించారని, పోలిస్ స్టేషన్లో కేసుపెడితే 15 రోజులు ఐన న్యాయం జరగడం లేదని అన్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్