రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూముల సర్వే చేయాలి..

212

రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూముల సర్వే చేయాలి..

హుస్నాబాద్: 4 జనవరి

తెలంగాణ రాష్ట్రంలో సర్వే నెంబర్ ల వారిగా భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి చొరవ చూపాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి పాతిన హద్దు రాళ్ల మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని భూ సమస్యల పరిష్కారానికి కొర్టుల చుట్టూ తిరుగుతూ నష్ట పోతున్నారని ప్రభుత్వం చోరవ తీసుకొని భూ సమస్యల పరిష్కారానికి,ధరణి వెబ్ సైట్ వల్ల అనేక నష్టలు జరుగుతున్నాయని సిఎం కెసిఆర్ వెంటనే భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేసి పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పూర్తికోసం 3 లక్షలు ఇచ్చేందుకు, అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు ఫించడ్లు ఇవ్వాలని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం సిపిఐ సమగ్ర అభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందించి కావాల్సిన ప్రజా పోరాటాలు నిర్వహించేందుకు రూపకల్పన చేసామని సిపిఐ నిర్వహించే ప్రజా ఉద్యమాల్లో ప్రజలు భాగస్వామ్య కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్, యెడల వనేష్, సృజన్ కుమార్, భాస్కర్, బద్దిపడగ రాజారెడ్డి, సంజివరెడ్డి, బెక్కంటి సంపత్,భారత తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి