డీఈఈ వెంకట రమణారావు మృతి
ఆర్మూర్: 6 జనవరి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నీటి పారుదల శాఖ డీఈఈ వెంకట రమణారావు ఆత్మహత్యకు శుక్రవారం ఉదయం గోదావరి నదిలో వెంకటరమణా రావు మృతదేహం నీటిలో తెలియాడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. గురువారం నవీపేట్ మండలం పోతంగల్లో అదృశ్యమైనట్టు కుటుంబసభ్యులు నవీపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గురువారం ఇంటి నుంచి బైక్పై వెళ్లిన అతను గోదావరి వద్ద బైక్ను వదిలివేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం డెడ్ బాడీని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియలసివుంది.